ఆసిఫాబాద్: గల్లంతైన మూడు రోజులకు మృతదేహం లభ్యం

కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దహేగాం మండలంలోని బోర్లకుంట గ్రామానికి చెందిన జమ్మిడి మధుకర్ శుక్రవారం పెద్దవాగులో స్నానానికి వెళ్లి గల్లంతయ్యారు. రెండు రోజుల పాటు గజ ఈతగాళ్లు గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఆచూకీ లభించలేదు. ఆదివారం మధ్యాహ్నం బీబ్రా వద్ద మధుకర్ మృతదేహాన్ని గుర్తించారు. గాలింపు చర్యలను ఎమ్మెల్యే పాల్వాయి హరిష్ బాబు సందర్శించి ఆరాతీశారు.

సంబంధిత పోస్ట్