బోథ్: స్పెషలిస్ట్ మెడికల్ క్యాంపును సద్వినియోగం చేసుకోండి

స్వస్థనారీ స్వస్థత పరివార్ కార్యక్రమంలో భాగంగా నేరేడిగొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో శుక్రవారం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డిఎంహెచ్ఓ నరేందర్ రాథోడ్ మాట్లాడుతూ అక్టోబర్ 2 వరకు నిర్వహించబడుతున్న స్పెషలిస్ట్ మెడికల్ క్యాంపును ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సీజనల్ వ్యాధులు రాకుండా వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాల శుభ్రతను పాటించాలని సూచించారు. అంతకుముందు ఆసుపత్రి రికార్డులను పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్