ఉట్నూరు మండలంలో బుధవారం మధ్యాహ్నం మోస్తరు వర్షం కురిసింది. ఉదయం ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ, మధ్యాహ్నం వాతావరణం చల్లబడి వర్షం మొదలైంది. హస్నాపూర్, మారుగుడ, దేవుగుడ వంటి గ్రామాల్లో వర్షం పడింది. వర్షం కారణంగా వాహనదారులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భారీ వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో విద్యుత్ తీగలు, చెట్ల కింద ఉండవద్దని అధికారులు ప్రజలకు సూచించారు.