బోథ్ ఎమ్మెల్యే సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరిన గ్రామస్తులు

ఇచ్చొడ మండలంలోని ముఖ్రా (బి) గ్రామ పంచాయతీ పరిధిలోని రఘు గూడ, మంకు గూడ గ్రామానికి చెందిన పలువురు ఆదివారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఎమ్మెల్యే వారికి పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా పనిచేయాలని, కేసీఆర్ ను మళ్ళీ ముఖ్యమంత్రిగా చేసే బాధ్యత పార్టీ నేతలపై ఉందని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మారుతి, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్