దేవులవాడ సబ్ స్టేషన్ ఆపరేటర్ అనారోగ్యంతో మృతి

కోటపల్లి మండలం దేవులవాడ సబ్ స్టేషన్ లో ఆపరేటర్ గా పనిచేస్తున్న బజ్జూరి సంతోష్ అనారోగ్యంతో శనివారం మృతి చెందాడు. కొద్ది రోజులుగా జ్వరంతో బాధపడుతున్న ఆయన కరీంనగర్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. సంతోష్ మృతితో వెల్మపల్లి గ్రామం విషాదంలో మునిగిపోయింది. ఆయన సేవలను గుర్తు చేసుకుంటూ చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కన్నీరు మున్నీరయ్యారు.

సంబంధిత పోస్ట్