మంచిర్యాల: చేపల వేటకు వెళ్లి యువకుడి మృతి

మంచిర్యాల జిల్లా కేంద్రంలో విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆదివారం ఉదయం ఎన్టీఆర్ నగర్ కు చెందిన చింతల రాజేష్ సమీపంలోని రాళ్లవాగులో చేపల వేటకు వెళ్ళాడు. నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉండటంతో అతను నీటిలో మునిగి గల్లంతయ్యాడు. స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని గాలింపు చర్యలు చేపట్టి, మృతదేహాన్ని వెలికితీశారు. ఈ ఘటనతో జిల్లా కేంద్రంలో తీవ్ర విషాదం నెలకొంది.

సంబంధిత పోస్ట్