ప్రేమికుల బలవన్మరణం!

నిర్మల్ జిల్లా లోకేశ్వరం మండలంలోని వట్టోలి గ్రామంలో ప్రేమించుకున్న యువతీ యువకులు మనస్పర్థల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. వట్టోలి గ్రామానికి చెందిన బండోల్ల నరేశ్ (22), భూంపల్లి అఖిల (21)లు ప్రేమించుకున్నారు. ఆదివారం వారి మధ్య జరిగిన ఫోన్ సంభాషణల వల్ల మనస్పర్థలు రావడంతో, అఖిల ఆదివారం రాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం తెలుసుకున్న నరేశ్, గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. సోమవారం ఉదయం నరేశ్ మృతదేహం లభ్యమైంది. ఇరువైపుల తల్లిల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్