కారు ఢీకొని యువకుడు మృతి: నిర్మల్ జిల్లాలో విషాదం

నిర్మల్ జిల్లా లక్ష్మణ చందా మండలం వడ్యాల్ తండా గ్రామానికి చెందిన 30 ఏళ్ల ధరావత్ నందు, ఆగస్టు 30న భార్యతో కలిసి నిర్మల్ వెళ్తుండగా కొండాపూర్ ఫ్లైఓవర్ వద్ద కారు ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందారు. ఈ ప్రమాదంలో అతని భార్య కాలు విరిగింది. మృతునికి భార్య, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. అతని అంత్యక్రియలు గురువారం ఉదయం జరగనున్నాయి. ఈ ఘటన ఆ గ్రామంలో, కుటుంబంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

సంబంధిత పోస్ట్