తెలంగాణలో దారుణం చోటుచేసుకుంది. నాగర్ కర్నూల్ జిల్లా సంజాపూర్‌లో వివాహేతర సంబంధం కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ క్రమంలో ముగ్గురిని ప్రత్యర్థులు వేటకొడవళ్లతో నరికారు. కుటుంబ సభ్యులు వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో వారి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.