యూపీలోని రాయ్‌బరేలి జిల్లా మహారాజ్‌గంజ్ ప్రాంతంలో ఏడుగురు పిల్లల తల్లి తన ప్రియుడి మేనల్లుడితో పారిపోయిన షాకింగ్ ఘటన జరిగింది. అచ్లి గ్రామానికి చెందిన లాల్తి అనే 35 ఏళ్ల మహిళ తన 22 ఏళ్ల మేనల్లుడు ఉదయరాజ్‌తో ఇంటి నుండి పారిపోయింది. లాల్తి తన ఏడుగురు పిల్లలను గదిలో బంధించి, రూ.3 లక్షల నగదు, విలువైన ఆభరణాలను తీసుకుని తన ప్రియుడితో వెళ్లిపోయింది. కాగా, భర్తతో కలిసి జీవించేందుకు, పిల్లల బాధ్యత తీసుకునేందుకు ఆమె నిరాకరించింది.