ఎయిరిండియా ప్రమాద ఘటన.. సుప్రీం కోర్టును ఆశ్రయించిన పైలట్‌ తండ్రి

ఈ ఏడాది జూన్‌లో అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదంలో 260 మంది మృతి చెందారు. ఈ కేసులో న్యాయస్థానం పర్యవేక్షణలో దర్యాప్తు కోరుతూ మృతుడైన ప్రధాన పైలట్ సుమీత్ సభర్వాల్ తండ్రి పుష్కరాజ్‌ సభర్వాల్, పైలట్ల సమాఖ్యతో కలిసి సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ప్రాథమిక దర్యాప్తు లోపభూయిష్టమైందని, పైలట్లపైనే దృష్టి సారించిందని ఆరోపించారు. స్వతంత్ర నిపుణుల కమిటీతో విచారణ జరపాలని కోరారు.

సంబంధిత పోస్ట్