పంజాబ్ వరద బాధితుల కోసం అక్షయ్‌ కుమార్‌ రూ.5 కోట్ల విరాళం

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు పంజాబ్‌ అతలాకుతలమైంది. వరద బాధితులను ఆదుకోవడానికి బాలీవుడ్‌ నటుడు అక్షయ్‌ కుమార్‌ తన వంతుగా రూ. 5 కోట్ల విరాళం ప్రకటించారు. "డొనేషన్‌ అనే పదం నచ్చదు, అది సేవ మాత్రమే" అని ఆయన అన్నారు. సహాయం చేసే అవకాశం తన అదృష్టమని పేర్కొన్న అక్షయ్, గతంలో చెన్నై వరదలు, కొవిడ్ సమయంలోనూ ముందుకొచ్చారు. 'భారత్‌ కీ వీర్‌'లో భాగంగా సైనిక కుటుంబాలకు కూడా మద్దతిచ్చారు.

సంబంధిత పోస్ట్