ఏపీ, తెలంగాణలోని దివ్యాంగులకు గుంటూరు జిల్లా మంగళగిరి రోటరీ క్లబ్ నిర్వాహకులు శుభవార్త చెప్పారు. దివ్యాంగులకు అక్టోబరు 13 నుంచి 17వ తేదీ వరకు మంగళగిరిలోని వీటీజేఎం అండ్ ఐవీటీఆర్ డిగ్రీ కాలేజీలో ఉచితంగా కృత్రిమ చేతులను పంపిణీ చేయనున్నారు. 'మంగళకరం-2025' పేరుతో రోటరీ క్లబ్ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ మేరకు దివ్యాంగులు 72074 03150 నంబర్‌కు సంప్రదించి పేరు నమోదు చేసుకోవాలి.