తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వర్ష సూచన చేసింది. ఈ మేరకు పలు జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. గురువారం కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణశాఖ హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.