కేంద్ర రవాణా శాఖ పాత వాహనాలకు హైసెక్యూరిటీ రిజిస్ట్రేషన్ ప్లేట్లు (HSRP) తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. 2019 మార్చి 31కి ముందు కొనుగోలు చేసిన వాహనదారులు ఈ నెల 30వ తేదీ లోపు ఈ నంబర్ ప్లేట్లను బిగించుకోవాలని గడువు విధించింది. గడువులోగా వాహనదారులు HSRP మార్చుకోకుంటే బీమా, పొల్యూషన్ ధ్రువపత్రాల జారీ నిలిచిపోతుందని అధికారులు చెబుతున్నారు. అమ్మకాలు, కొనుగోళ్లు కూడా సాధ్యం కావని అంటున్నారు.