పుష్ప తర్వాత ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వరుస అవార్డులతో దూసుకుపోతున్నాడు. తాజాగా దుబాయ్‌లో జరిగిన సైమా అవార్డుల్లో పుష్ప-2కి ఉత్తమ నటుడి అవార్డు అందుకున్నాడు. ఇంతకుముందు కూడా సన్నాఫ్ సత్యమూర్తి (2015), రుద్రమదేవి (2016), అలావైకుంఠపురములో (2021), పుష్ప (2022) చిత్రాలకు సైమా అవార్డులు గెలుచుకున్న ఆయన, టాలీవుడ్‌లో అత్యధిక సైమా అవార్డులు అందుకున్న హీరోగా రికార్డు సృష్టించాడు. ఇటీవల గద్దర్ అవార్డ్స్‌లోనూ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కించుకున్నాడు.