అరటి పండ్ల మాదిరిగానే, అరటి పువ్వులు కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయని నిపుణులు తెలిపారు. వీటిని కూరగా చేసుకుని తినవచ్చు. అరటి పువ్వులో ఫైబర్, విటమిన్లు, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది బరువు తగ్గడానికి, జీర్ణక్రియను మెరుగుపరచడానికి, గుండె ఆరోగ్యాన్ని కాపాడటానికి, రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించడానికి, రోగనిరోధక శక్తిని పెంచడానికి, మహిళల రుతు సమస్యలను తగ్గించడానికి, రక్తహీనతను నివారించడానికి సహాయపడుతుంది.