TG: ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతమైంది. హైదరాబాద్ నగరంలో ఇవాళ సాయంత్రం రెండు ఇంద్రధనుస్సులు పక్కపక్కనే కనిపించి, కనువిందు చేశాయి. ఓవైపు చినుకులు పడుతుంటే, మరో వైపు సూర్యుడు అస్తమిస్తున్న సమయంలో ఆకాశంలో సప్తవర్ణాలతో కూడిన ఇంద్రధనస్సులు ఏర్పడ్డాయి. ప్రజలు తమ ఫోన్లలో ఈ అద్భుత దృశ్యాన్ని బంధించి, సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.