ఒడిశాలోని చిలికా సరస్సులో అధ్బుత దృశ్యం ఆవిష్కృతమైంది. సరస్సులో సంభవించిన టోర్నడో లాంటి ప్రకృతి దృశ్యం పర్యాటకులనే కాదు స్థానికులను భయబ్రాంతులకు గురిచేసింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. దీనిని వాటర్ స్పౌట్ గా వాతావరణ నిపుణులు గుర్తించారు. విశాలమైన నీటి ఉపరితలాలు, సముద్ర ప్రాంతాల్లో ఏర్పడే ఒక వాతావరణ స్థితి అని తెలిపారు. అయితే పర్యాటకులు, మత్స్యకారులు భయాందోళనకు గురైనా వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదని పేర్కొన్నారు.