అమెజాన్‌లో 14 వేల ఉద్యోగాలకు కోత

ప్రముఖ ఇ-కామర్స్‌ సంస్థ అమెజాన్ మరోసారి పెద్దఎత్తున ఉద్యోగులపై వేటు వేసేందుకు సిద్ధమైంది. ఆర్టిఫిషియల్ ఇంటెజెన్స్‌పై భారీగా ఖర్చు చేస్తున్న నేపథ్యంలో, 14 వేల కార్పొరేట్ ఉద్యోగాలను తొలగించనున్నట్లు అధికారికంగా ప్రకటించింది. కస్టమర్ల అవసరాలకు అనుగుణంగా, బ్యూరోక్రసీని తగ్గించి, అనవసర లేయర్లను తొలగిస్తున్నామని సీనియర్ వైస్ ప్రెసిడెంట్ బెతత్‌ గలెట్టి ఉద్యోగులకు రాసిన సందేశంలో పేర్కొన్నారు. అమెజాన్ సీఈఓ యాండీ జెస్సీ బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి లేఆఫ్‌ల పర్వం కొనసాగుతోంది.

సంబంధిత పోస్ట్