భారతీయ భర్తే కావాలంటూ ప్లకార్డ్‌తో అమెరికన్ అమ్మాయి (వీడియో)

యువతీ యువకులు తమ భాగస్వామిని ఎన్నో మార్గాల్లో వెతుకుతుంటారు. అయితే న్యూయార్క్‌లోని టైమ్స్ స్క్వేర్ వద్ద ఓ యువతి విభిన్నంగా తన కోరికను ప్రకటించింది. ఆమె చేతిలోని ప్లకార్డ్‌పై “భారతీయ భర్త కోసం చూస్తున్నాను” అని రాసి ఉంది. ఈ వీడియో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతూ చర్చలకు దారితీస్తోంది. ఆమె ఎవరు అనేది తెలియకపోయినా.. ఎందుకు ప్రత్యేకంగా భారతీయ భర్తనే కోరుకుంటుందన్న ప్రశ్న నెటిజన్లలో ఆసక్తి రేపుతోంది.

సంబంధిత పోస్ట్