భారత్‌పై అమీర్ కలీమ్‌ హాఫ్ సెంచరీ

ఆసియా కప్‌లో భాగంగా అబుదాబి వేదికగా శుక్రవారం టీమిండియాతో జరుగుతున్న మ్యాచ్‌లో ఒమన్‌ ఓపెనర్ అమీర్ కలీమ్‌ హాఫ్ సెంచరీ సాధించారు. కలీమ్‌ దూకుడుగా ఆడుతూ 38 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 50 పరుగులు పూర్తి చేసుకున్నారు. దీంతో 15 ఓవర్లకు ఒమన్ స్కోర్‌ 116/1గా ఉంది. క్రీజులో అమీర్ కలీమ్‌ (50), హమ్మద్‌ మీర్జా (28) పరుగులతో ఉన్నారు. ఒమన్‌ విజయానికి 31 బంతుల్లో 73 రన్స్‌ అవసరం.

సంబంధిత పోస్ట్