ఇంటర్యూకి 3 నిమిషాలు ఆలస్యంగా వెళ్లిన టెకీకి ఊహించని ట్విస్ట్‌!

ఒక భారతీయ టెకీ ఇంటర్వ్యూకి మూడు నిమిషాలు ఆలస్యమవ్వడం నెట్టింట హాట్‌ టాపిక్‌గా మారింది. r/IndianWorkplace సబ్‌రెడిట్‌లో తన అనుభవాన్ని పంచుకున్న ఆ టెకీ తెలిపిన వివరాలు ఆసక్తి రేపుతున్నాయి. ఉదయం 9 గంటలకు షెడ్యూల్‌ చేసిన ఇంటర్వ్యూకి 9:03కు చేరుకున్నానని, క్షమాపణలు చెప్పినా మేనేజర్‌ “మిగిలిన 27 నిమిషాలు మీకే ఇస్తున్నాను” అంటూ ఇంటర్వ్యూను ముగించారని అతను చెప్పాడు. ఈ సంఘటనపై నెట్టింట విస్తృత చర్చ మొదలైంది. నెటిజన్‌లు పలు రకాలుగా స్పందిస్తున్నారు.

సంబంధిత పోస్ట్