వాట్సప్‌లో మరో అదిరిపోయే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. కొత్తగా మెసేజ్ ట్రాన్స్‌లేషన్ ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఇప్పటికే వాయిస్ మెసేజ్‌లను టెక్స్ట్ రూపంలో అందించే సదుపాయం ఉండగా.. తాజాగా మెసేజ్‌లను నచ్చిన భాషలో చదువుకునే సదుపాయాన్ని తెచ్చింది. త్వరలో ఈ ఫీచర్ యూజర్లకు అందుబాటులోకి రానుంది.