కోల్‌కతా ఆర్జీకర్ అత్యాచార ఘటన తరహాలో వెస్ట్ బెంగాల్‌లో మరో మెడికల్ స్టూడెంట్‌పై అత్యాచారం జరిగింది. ఒడిశాకు చెందిన యువతి షోభార్‌పూర్ కాలేజీలో MBBS చదువుతోంది. ఫ్రెండ్‌తో కలిసి శుక్రవారం రాత్రి బయటకు వెళ్తుండగా క్యాంపస్ గేటు వద్ద ఓ వ్యక్తి పక్కకు లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ప్రస్తుతం విద్యార్థిని చికిత్స పొందుతోంది. డాక్టర్‌గా చూడాలని ఎన్నో ఆశలతో కుమార్తెను చదివిస్తున్నామని ఆమె తండ్రి రోదించారు. ఈ ఘటనపై విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు.