పూణే- షోలాపూర్ హైవే పై మరో ఘోర రోడ్డు ప్రమాదం(వీడియో)

పూణే- షోలాపూర్ హైవే పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పూణే నుంచో షోలాపూర్ వైపు వేగంగా వెళ్తున్న టెంపో వాహనం అదుపు తప్పి.. మధ్యలో ఉన్న డివైడర్‌ను ఢి కొట్టింది. ఈ క్రమంలో డివైడర్‌ మీదుగా దూసుకెళ్లి అటువైపు దారిలో ఎదురుగా వస్తున్న మరో వాహనంపై పడింది. దౌండ్ తాలూకా పరిధిలోని వఖారి గ్రామం వద్ద శనివారం సాయంత్రం ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో ఒక వ్యక్తి మరణించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాద దృశ్యాలు అక్కడి సీసీటీవీలో రికార్డు అయ్యాయి.

సంబంధిత పోస్ట్