అమెరికా కెంటకీ రాష్ట్రంలోని లూయిస్వీలె మహమ్మద్ అలీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు సమీపంలో కార్గో విమానం క్రాష్ అయిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు నలుగురు మృతి చెందారని, మరో 11 మందికి గాయపడ్డారని అధికారులు వెల్లడించారు. కాగా ఈ విమాన ప్రమాదానికి సంబంధించి తాజాగా మరో సీసీ ఫుటేజీ వెలుగులోకి వచ్చింది. విమానం భూమిని తాకి ఒక్కసారిగా పేలిపోయినట్లు ఆ వీడియోలో కనిపించింది. ఈ ఘటనలో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.