మద్యం మత్తులో పాము తలను కొరికాడు(వీడియో)

AP: మద్యం మత్తులో ఓ వ్యక్తి పాము తలను కొరికాడు. ఈ ఘటన తిరుపతి జిల్లా తొట్టంబేడు మండలంలోని చియ్యంవరం గ్రామంలో చోటు చేసుకుంది. మద్యం తాగి ఇంటికి వెళ్తున్న వెంకటేశ్ అనే వ్యక్తిని పాము కాటేసింది. దానిపై కోపంతో అదే మత్తులో పాము తలను కొరికి ఇంటికెళ్లాడు. పరిస్థితి విషమించడంతో కుటుంబ సభ్యులు శ్రీకాళహస్తి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మళ్లీ తిరుపతి రుయాకు తీసుకెళ్లారు.

సంబంధిత పోస్ట్