తమిళనాడులో మంగళవారం దారుణం జరిగింది. ఏపీ యువతిపై అక్కడి పోలీసులు సామూహిక అత్యాచారం చేశారు. తిరువణ్ణామలైలో ఎంథాల్ బైపాస్ వద్ద టమాటాల లోడుతో వెళ్తున్న లారీని ఇద్దరు పోలీసులు ఆపారు. అనంతరం అందులో ఉన్న యువతిని కిందికి దింపి, పొలాల్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేశారు. కానిస్టేబుళ్లు సుందర్, సురేష్ రాజ్‌లను నిందితులుగా గుర్తించారు. స్థానికులు స్పందించి బాధితురాలిని ఆసుపత్రికి తరలించారు.