AP: బాపట్ల జిల్లాలో శనివారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. కొండుబోట్లపాలెం గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై లారీ, బైక్ ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు. వారిని పోస్ట్‌మార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు.