ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కీలక నిర్ణయం.. ఓపీ సేవలు నిలిపివేత

AP: ఆంధ్రప్రదేశ్ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ (ఏఎస్‌హెచ్‌ఏ) కీలక నిర్ణయం తీసుకుంది. ఓపీ సేవలు నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. హాస్పిటల్స్‌కు రూ.2,500 వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం చెల్లించని కారణంగా ఓపీ సేవలను నిలిపివేస్తున్నట్లు తెలిపింది. వారంలోగా బకాయిలు చెల్లించాలని కోరింది. ఈ మేరకు ఎన్టీఆర్ వైద్య సేవ సీఈవోకు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్ అసోసియేషన్ ప్రతినిధులు లేఖ రాశారు.

సంబంధిత పోస్ట్