మధ్యప్రదేశ్‌లోని నైన్‌పూర్‌కు చెందిన 26 ఏళ్ల వ్యాపారవేత్త సాహిల్ ప్రాణాన్ని ఆపిల్ వాచ్ కాపాడింది. రైలులో ప్రయాణానికి సిద్ధమవుతుండగా, ఆపిల్ వాచ్ అతని హార్ట్ రేట్ అసాధారణంగా పెరిగిందని అలర్ట్ ఇచ్చింది. వెంటనే ట్రైన్ రద్దు చేసుకుని ఆసుపత్రికి చేరుకున్న సాహిల్‌కు డాక్టర్లు 180/120 బీపీతో బ్రెయిన్ హేమరేజ్ ప్రమాదం ఉన్నట్లు తెలిపారు. సకాలంలో హాస్పిటల్ చేరడంతో అతని ప్రాణం నిలిచింది. దీంతో ఆపిల్ సీఈఓ టిమ్ కుక్‌కు సాహిల్ థ్యాంక్యూ చెప్పగా.. కుక్ వ్యక్తిగతంగా స్పందించారు.