క్రీమ్ బిస్కెట్లు ఆరోగ్యానికి హానికరమని వైద్య నిపుణులు హెచ్చరించారు. వీటిలో పాలు లేదా అసలు క్రీమ్ ఉండకపోగా, హైడ్రోజనేటెడ్ ఆయిల్, కృత్రిమ రుచులు, అధిక చక్కెర, సింథటిక్ రంగులు కలుపుతారని చెప్పారు. ఎక్కువగా తింటే ఊబకాయం, అధిక కొలెస్ట్రాల్, ఇన్సులిన్ నిరోధకత వంటి సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని నిపుణులు సూచించారు.