వాకింగ్ ఒక్కటే సరిపోదు, సరైన ఆహారం కూడా అవసరమే. రోజూ గంటసేపు నడిచినా సరైన పోషకాహారం తీసుకోకపోతే బరువు పెరుగుదలతో పాటు కొత్త సమస్యలు వస్తాయి. కండరాల బలహీనత, శరీర భంగిమలో మార్పులు, అలసట, పొట్ట చుట్టూ కొవ్వు పేరుకుపోవడం ఇవన్నీ ఆహార లోపాలే. కాబట్టి వాకింగ్ ఫలవంతం కావాలంటే కచ్చితంగా సమతుల్య ఆహారం తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.