దసరాకు ​ఊరెళ్తున్నారా?.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి

* దసరా సెలవులకు మీ స్వగ్రామానికి వెళ్లేటప్పుడు విలువైన బంగారు, వెండి వస్తువులు, నగదు ఇంట్లో ఉంచొద్దు. వెంట తీసుకెళ్లడం లేదా బ్యాంకు లాకర్లలో భద్రపరచుకోవాలి.
* మీరు ఇంట్లో లేనప్పుడు పాలప్యాకెట్లు, పేపర్లు తలుపు ముందు జమవ్వకుండా చూడటం మంచిది. ఇంటి బయట, లోపల లైట్లు ఆన్‌లో ఉంచుకోవాలి.
* ఇంట్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవడం మంచిది.
* ఊరికి వెళ్లినట్లయితే పోలీసులకు సమాచారం ఇవ్వాలి.
* చుట్టుపక్కల అనుమానాస్పదంగా తిరిగే వారిపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచుకోవాలి.

సంబంధిత పోస్ట్