శరీరంలో జీర్ణక్రియ సవ్యంగా కొనసాగేందుకు విటమిన్ బి1 ఎంతో అవసరం. మనం తీసుకునే ఆహారాన్ని శక్తిగా మార్చడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది. శరీరంలో విటమిన్ బి1 స్థాయి తగ్గితే జీవక్రియ నెమ్మదించి, ఆకలి తగ్గడం, అలసట, బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తాయి. దీనితో పాటు, నాడీ వ్యవస్థ, జీర్ణ వ్యవస్థ, కండరాల పనితీరుపై కూడా ప్రభావం చూపుతుంది. మానసిక గందరగోళం, చిరాకు, ఏకాగ్రత లోపం వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. వృద్ధుల్లో ఎక్కువగా కనిపించినా, యువతలోనూ ఈ లోపానికి సంబంధించిన ప్రభావాలు పెరుగుతున్నాయి.