హరియాణాలో సీనియర్ ఐపీఎస్ అధికారి పూరన్ కుమార్ ఆత్మహత్య మరవకముందే మరో పోలీస్ అధికారి సూసైడ్ చేసుకున్నాడు. పూరన్ కుమార్ పై పలు అవినీతి ఆరోపణలు చేసిన ASI సందీప్ తన సర్వీస్ రివాల్వర్ తో కాల్చుకుని ఆత్యహత్యకు పాల్పడ్డాడు. సైబర్ విభాగంలో పనిచేస్తున్న ASI సందీప్ ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన పోలీసు వర్గాల్లో కలకలం రేపింది.