ఆసియా కప్ 2025లో భారత యువ ఆటగాడు అభిషేక్ శర్మ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడు. ఇప్పటివరకు ఆడిన 4 మ్యాచ్‌లలో 173 పరుగులు చేసి, అత్యధిక పరుగులు సాధించిన ఆటగాళ్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచాడు. పాకిస్తాన్ ఆటగాడు సాహిబ్‌జాదా ఫర్హాన్ (132 పరుగులు), శ్రీలంక ఆటగాడు పాథుమ్ నిస్సంక (146 పరుగులు) అతనిని అధిగమించడానికి ప్రయత్నిస్తున్నారు. వీరి మధ్య టాప్ రన్ స్కోరర్ స్థానం కోసం పోటీ ఆసియా కప్ 2025కు మరింత ఆసక్తిని పెంచుతోంది. పాకిస్తాన్, శ్రీలంక మధ్య జరగనున్న మ్యాచ్‌లలో నిస్సంక, ఫర్హాన్ పెద్ద ఇన్నింగ్స్‌లు ఆడితే అభిషేక్‌ను అధిగమించే అవకాశం ఉంది.