ఆసియా కప్‌.. ఆఫ్ఘనిస్తాన్‌పై బంగ్లాదేశ్ విజయం

ఆసియా కప్‌ 2025లో భాగంగా అబుదాబిలో ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ 8 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 154 పరుగులు చేసింది. లక్ష్యఛేదనలో ఆఫ్ఘన్ జట్టు 20 ఓవర్లలో 146 పరుగులు చేసి ఆలౌటైంది. గుర్బాజ్ (35), అజ్మతుల్లా (30), రషీద్ (20) పోరాడినా అఫ్గాన్‌కు ఓటమి తప్పలేదు. బంగ్లాదేశ్‌ బౌలర్లలో ముస్తాఫిజుర్ 3, నసూమ్, రిషద్, తస్కిన్ రెండేసి వికెట్లు తీశారు.

సంబంధిత పోస్ట్