దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా ఆదివారం పాకిస్థాన్‌తో జరగనున్న ఆసియా కప్ ఫైనల్ మ్యాచ్‌కు ముందు భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, అభిషేక్ శర్మల గాయాలపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ స్పష్టత ఇచ్చారు. శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో స్వల్ప గాయాలపాలైన వీరిద్దరూ ఫైనల్ ఆడతారా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో మోర్కెల్ మాట్లాడుతూ, పాండ్యా బాగానే ఉన్నాడని, మ్యాచ్ ముందు తుది నిర్ణయం తీసుకుంటామని అన్నారు. అభిషేక్‌కు ఎలాంటి గాయం కాలేదని, అతను ఫైనల్‌కు అందుబాటులో ఉంటాడని తెలిపారు.