ఆసియా కప్.. సూపర్‌-4కు శ్రీలంక

ఆసియా కప్‌ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా సోమవారం హాంకాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో శ్రీలంక 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆడిన రెండు మ్యాచ్‌ల్లో గెలిచిన శ్రీలంక సూపర్‌-4కు అర్హత సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హాంకాంగ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. 150 పరుగుల లక్ష్యాన్ని శ్రీలంక 18.5 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రీలంక ఓపెనర్ పాథుమ్ నిశాంక (68) అర్థశతకంతో అదరగొట్టాడు.

సంబంధిత పోస్ట్