స్పైస్‌జెట్‌ సిబ్బందిపై దాడి.. ‘నో ఫ్లై లిస్ట్‌’లో ఆర్మీ అధికారి (వీడియో)

శ్రీనగర్‌ విమానాశ్రయంలో అదనపు లగేజీ వివాదంపై సిబ్బందిపై దాడి చేసిన ఆర్మీ అధికారిని డీజీసీఏ ఐదేళ్లపాటు ‘నో ఫ్లై లిస్ట్‌’లో చేర్చింది. దాదాపు 16 కిలోల లగేజీకి అదనపు ఛార్జీలు చెల్లించమన్న  స్పైస్‌జెట్‌ సిబ్బందిపై ఆయన దాడి చేయడంతో నలుగురికి గాయాలయ్యాయి. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదు కాగా, పౌర విమానయాన నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్