విమానం టేకాఫ్‌ సమయంలో ఎమర్జెన్సీ డోర్‌ తెరిచే యత్నం

వారణాసి నుంచి ముంబై వెళ్లాల్సిన ఆకాశ ఎయిర్ విమానంలో ఓ ప్రయాణికుడు కలకలం సృష్టించాడు. సోమవారం సాయంత్రం విమానం టేకాఫ్ అయ్యేందుకు సిద్ధమవుతున్న సమయంలో, జౌన్‌పూర్ జిల్లాకు చెందిన సుజిత్ సింగ్ అనే ప్రయాణికుడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్‌ను తెరిచేందుకు ప్రయత్నించాడు. అప్రమత్తమైన విమాన సిబ్బంది అతడిని అడ్డుకుని, అధికారులకు సమాచారం అందించారు. విచారణలో 'కేవలం ఆసక్తితోనే' డోర్ తెరిచేందుకు ప్రయత్నించానని సుజిత్ చెప్పినట్లు సమాచారం. అతనిపై కేసు నమోదు చేసి, స్టేషన్‌కు తరలించారు.

సంబంధిత పోస్ట్