TG: కూతురిని కిడ్నాప్ చేయడానికి తల్లిదండ్రులు యత్నించిన ఘటన జగిత్యాల జిల్లాలో జరిగింది. వెల్గటూర్ మండలం రాజక్కపల్లికి చెందిన మర్రి రాకేష్, ప్రియాంక అనే యువతి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కూతురు కులాంతర వివాహం ప్రియాంక తల్లిదండ్రులు ఇష్టంలేదు. అయితే ఇటీవల ప్రియాంకకు ఫోన్ చేసి మాట్లాడిన తల్లి.. ఇంటికి రమ్మని పిలిచింది. నమ్మి వెళ్తుండగా మార్గమధ్యంలో ప్రియాంకను కిడ్నాప్ చేయడానికి తన తండ్రి, బావ యత్నించారని సదరు యువతి తెలిపింది. ఈ మేరకు వారిపై ప్రియాంక పోలీసులకు ఫిర్యాదు చేసింది.