ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో పట్టపగలే ఓ యువకుడు దారుణానికి పాల్పడ్డాడు. కాలేజ్ నుంచి ఇంటికి తిరిగి వస్తున్న బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించాడు. దీంతో బాలిక గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు అతడిని పట్టుకున్నారు. అనంతరం బట్టలు ఊడదీసి చితక్కొట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించగా.. వారు ఘటన స్థలానికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.