నిర్మల్ జిల్లా నర్సాపూర్ (జి) మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కొరటికల్ గ్రామానికి చెందిన 11 మంది టాటా ఏస్ వాహనంలో కామోల్ గ్రామానికి అంత్యక్రియలకు వెళ్లి, తిరిగి వస్తుండగా రాంపూర్ గ్రామం వద్ద వెనుక నుంచి వచ్చిన ట్రాక్టర్ ఓవర్‌టేక్ చేసే క్రమంలో టాటా ఏస్‌ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ రాజేశ్వర్ (50)తో పాటు ఏడుగురికి గాయాలయ్యాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రాజేశ్వర్ మరణించాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.