రోడ్డుపై తనకు దొరికిన రూ.16 లక్షల విలువైన బంగారం, విలువైన పత్రాలు ఉన్న సంచిని పోగొట్టుకున్న మహిళలకు అప్పగించి ఓ ఆటో డ్రైవర్ నిజాయతీని చాటుకున్నారు. నిర్మల్ జిల్లా కడెం ప్రాంతానికి చెందిన సుజాత తన కుమార్తె పెళ్లి కోసం చేయించిన 16 తులాల బంగారు ఆభరణాలున్న సంచి కొండాపూర్ బైపాస్ వద్ద పడిపోయింది. లక్ష్మణచాంద మండలం రాచాపూర్ గ్రామానికి చెందిన డ్రైవర్ సాయికుమార్‌కు ఆ సంచి దొరకగా దాన్ని తిరిగి బాధితురాలు సుజాతకు అందజేశారు.