జేఎన్టీయూ హాస్టల్ గదిలో విద్యార్థి ఆత్మహత్య

సూర్యాపేట జిల్లా మోతె మండలం సిరికొండ గ్రామ పరిధిలోని ఓ తండాకు చెందిన మహేశ్ అనే విద్యార్థి శుక్రవారం మధ్యాహ్నం జేఎన్టీయూ హాస్టల్ గదిలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మూడు రోజులుగా కాలేజీకి వెళ్లకుండా గదికే పరిమితమైన మహేశ్, తోటి విద్యార్థులు క్లాసులకు వెళ్లిన తర్వాత ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. తోటి విద్యార్థులు గమనించి యూనివర్సిటీ సిబ్బందికి సమాచారం అందించారు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి గదిలో సూసైడ్ నోట్ దొరికినట్లు సమాచారం.

సంబంధిత పోస్ట్