'బాహుబలి ది ఎపిక్' లోని 1, 2 పార్టులను కలిపి ఎడిట్ చేసినా స్క్రీన్ ప్లే మారలేదని, 90 నిమిషాల సీన్లు కట్ చేసినా మూవీపై ప్రభావం పడలేదని విశ్లేషకులు పేర్కొన్నారు. బాహుబలి తిరిగి మాహిష్మతికి వచ్చే సీన్ గూస్బంప్స్ తెప్పిస్తుందని, విజువల్ ఎఫెక్ట్స్ ఆకట్టుకుంటాయని తెలిపారు. కీలక సన్నివేశాలతో కథను నడిపేందుకు రాజమౌళి వాయిస్ ఓవర్ ఇచ్చారని, అయితే తమన్నా లవ్ ట్రాక్, సుబ్బరాజు కామెడీ సీన్స్ లేకపోవడం కాస్త మైనస్ అని అభిప్రాయపడ్డారు.