చార్‌ధామ్ యాత్రలో భాగంగా దర్శనం పొందలేని భక్తుల కోసం బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ (BKTC) కొత్త ఏర్పాట్లు చేసింది. ఈ రెండు ఆలయాల ప్రసాదాన్ని దేశం నలుమూలల భక్తులకు స్పీడ్‌పోస్ట్ ద్వారా పంపే నిర్ణయం తీసుకుంది. ఇందుకు తపాలాశాఖతో ఒప్పందం కుదుర్చుకుంది. దేశంలో 24–72 గంటల్లో ప్రసాదం చేరుతుందని, విదేశాల్లో ఉన్నవారికి ఆయా దేశాల దూరాన్ని బట్టి పంపుతామని కమిటీ ప్రకటించింది.